కస్తూర్భా గాంధీ డిగ్రీ కళాశాలలోప్రారంభం నుండి తెలుగుని 2 వ భాషగా అందిస్తున్నారు. B.A./ B.SC. / B.COM గ్రూపుల ద్వారా తెలుగునివిద్యార్థులకునేర్పిస్తున్నారు . తెలుగు లెక్చరర్ విద్యారాణి గారు కళాశాలకు రెండవ ప్రిన్సిపాల్ గా ఎంతో కాలం తన సేవలను అందించారు.
మనిషి జీవితంలో మొదట నేర్చుకునే భాష మాతృభాష. అమ్మ మాటే మాతృభాష. అందుకే ప్రతి బిడ్డ అమ్మను కాపాడుకున్నట్టే మాతృభాషను కూడా కాపాడుకోవాలి.ఈ కర్తవ్యాన్నిగుర్తు చేసేందుకే అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని ఏటా నిర్వహిస్తున్నారు.
అంతర్జాతీయ మాతృభాషాదినోత్సవాన్ని ప్రతి ఏడాది ఫిబ్రవరి 21వ తేదీన నిర్వహించాలని యునెస్కో 30వ సాధారణమహాసభ (1999 నవంబరు 17న) ప్రకటించింది. 2000 సంవత్సరం నుంచి ప్రతి ఏటా మాతృభాషాపరిరక్షణకార్యక్రమాన్ని యునెస్కో డైరెక్టర్ జనరల్ ప్రకటిస్తూ వస్తున్నారు. పోతన మహాకవికి తమ హృదయంలోనే దేవాలయాలు కట్టి తెలుగువారు నేటికీ ఆరాదిస్తారు. మాతృబాషలో విధ్యాబోధన వల్ల గ్రహణ సామర్ధ్యం పెరుగుతుందని శాస్త్రజ్ఞులు అంటున్నారు. “మాతృబాషలో విధ్యాబోధన వల్ల విధార్ధులలో సృజనాత్మకత పెరుగుతుంది”. మాతృబాషలో విధ్యార్జన సులభం. ఇది గమనసామర్ధ్యాన్ని, జ్ఞానాన్నివేగవంతంచేస్తుంది, సృజనాత్మకతకు తోడ్పడుతుంది. అయితే తెలుగుబాషను ఆధునిక అవసరాలకు అనుగుణంగా అభివృద్ది చెయ్యాలి. మన మాతృభాషను నిర్లక్ష్యం చేయకూడదు. ఎగతాళి చేయకూడదు. కాబట్టి సుసంపన్నమైన మన భాషాసాహిత్య సౌందర్యాన్ని అవగాహన చేసుకోవడం, మన భాషను, సంస్కృతినీ కాపాడుకోవడం, భావితరాల వారికి దీన్ని అందించడం ఆ భాషాసౌందర్య సంపదను కాపాడటం అందరి కర్తవ్యం.
M.A.
Lecturer
Our college conducted VIDYANJALI PROGRAMME as a tributes to A. VIDYARANI (Ex-Principal ) . Literary competitions were conducted among Exhibition Society colleges and winners and participants were given prizes.